నిందితురాలితో మాట్లాడుతున్న ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య
ఎల్బీ నగర్, మహానది న్యూస్: నాగోల్ ఆనంద్ నగర్ రోడ్ నెంబర్ 4 లో ధూళిపాళ ధనలక్ష్మి వయసు 65 సం. తన సొంత ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నది. ఈ రొజు ఉదయం 10 గంటల సమయం లో ఆమె వంట చేయుచుండగా ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఒక గుర్తు తెలియని మహిళ ఇంటిలోకి ప్రవేశించి ధనలక్ష్మి మెడ లోని ఒక తులం బంగారు గొలుసు లాక్కొని ఆమె నోటికి ప్లాస్టర్ వేసి పారిపోయింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికుల కు తెలపగా ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరించి నాగోల్ & సి సి యస్ LB నగర్ పోలీసులు సీసీ కెమెరా ల సహాయం తో కేవలం మూడు గంటల వ్యవధిలోనే నాగోల్ ఫతుల్లా గూడ లో కూరగాయల దుకాణం నడిపే స్రవంతి గా గుర్తించి ఆమెను అదుపు లోకి తీసుకొన్నారు.
