బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ లో వరద ముంపు కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీ నగర్, మహానది న్యూస్, సెప్టెంబర్ 23: గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని హరిహరపురం,స్నేహమయి నగర్ కాలనీ, వినూత్న ఎంక్లేవ్, గాంధీ నగర్, గాంధీ నగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ పూర్తిగా వరదముంపుకు గురి అయిన నేపథ్యంలో ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆయా కాలనీలలో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీవాసులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని గుర్రంగూడ ఫారెస్ట్ లోని రాగికుంట నుండి గాంధీనగర్స్నే, హమైనగర్, పీవీఆర్ కాలనీ, సామ నగర్ నుండి కుమ్మరికుంట వరకు వరదకాలువ నిర్మాణం కొరకు హరిహరపురం చెరువు నుండి వివేకానంద విగ్రహం, శివ సింధు చౌరస్తా, శివాలయం, గౌతమి నగర్, బతుకమ్మకుంట మీదుగా కుమ్మరికుంట వరకు వరదకాలువ నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే సంవత్సరం వర్షాకాలం వచ్చే లోపు వరద ముంపు సమస్య తీర్చనున్నట్టు కాలనీవాసులకు సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరీ, డివిజన్ భారస పార్టి ఉపాధ్యక్షులు సందీప్ రెడ్డి, కాజా శ్రీనివాస్, రషీద్, నరేష్, అమర్థ్య, స్నేహమైనగర్ కాలనీ అధ్యక్షులు రామాంజనేయులు, హరిహరపురం కాలనీ గౌరవ అధ్యక్షులు కళ్లెం విష్ణువర్ధన్ రెడ్డి, అధ్యక్షులు శంకర్ గౌడ్, గాంధీనగర్ అధ్యక్షులు మల్లారెడ్డి, గాంధీనగర్ సౌత్ కాలనీ అధ్యక్షులు కృష్ణరెడ్డి, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు కృష్ణ, గాయత్రినగర్ కాలనీ అధ్యక్షులు రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.