కల్వకుర్తి, మహానది న్యూస్: కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో గత గురువారం రోజు కల్వకుర్తి ఎమ్మెల్యే  కసిరెడ్డి నారాయణరెడ్డితో  పాటు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి పర్యటించారు. ఈ సంధర్బంగా  గుండూరు నుండి తుర్కలపల్లి వరకు రోడ్డు, ఈ రెండు గ్రామాల మధ్య  ఉన్న  చిన్న వాగు పైన కల్వర్టు లేక దశాబ్దాల కాలం నుండి ఈ ప్రాంత రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు పోవడానికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని గ్రామ ప్రజలు వారి ద్రుష్టి కి తీసుకెళ్లి, వినతిపత్రం అందజేశారు. తక్షణమే స్పందించిన  ఎంపీ, ఎమ్మెల్యేలు పంచాయతీ రాజ్ శాఖ డీఈ కి ఫోన్ చేసి సత్వరమే గుండూర్ గ్రామం లో పర్యటించి రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలాని ఆదేశించారు.

స్పందించిన డీఈ బసవలింగం శనివారం రోజు ఏఈ  షబ్బీర్ తో కలిసి రోడ్డు, చిన్న వాగు దగ్గర కల్వర్టు నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సురభి వెంకటేశ్వరా రావు డీఈ తో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల సౌకర్యార్థం తక్షణమే రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

వారి వెంట గుండూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వెంకటయ్య, నంబి శంకర్, భరత్ కుమార్ రెడ్డి, ప్రతాపరెడ్డి, దేవేందర్ రావు, పోతుగంటి అశోక్, తుంగభద్ర వెంకటయ్య, నంబి వెంకటయ్య, గ్రామానికి చెందిన ఆ ప్రాంతరైతులు మొగిలి లింగమయ్య, భోగరాజు వెంకటయ్య, మోహన్ రావు, రామేశ్వరరావు, గోపాల్, శ్రీనివాసులు తిమ్మసాని శ్రీనివాసులు, నంబి బీరప్ప, నంబి శ్రీకాంత్, నంబి అంజనేయులు, భాషమోని చిన్న రాములు, మంగలి చిన్నయ్య, తుమ్మల రామచంద్రయ్య, తుమ్మల లింగయ్య, తుమ్మల జంగయ్య, ఐనేని సంపత్ రావు, మొగిలి రామకృష్ణ, నంబి తిక్కయ్య, భాషమోని శివుడు, మంగలి రాములు, ఉప్పరి వెంకటయ్య, పోతరపల్లి చిన్న నిరంజన్, భాస్కరరావు తదితరులు ఉన్నారు. రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు అప్పటి ఎమ్మెల్యేకు, ఎంపీకి ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన ఒక్కసారి కూడా స్పందించలేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో మేము వెంకటేశ్వరరావు ద్వారా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి అధికారులను పంపించినందుకు రైతులు ఎంపీ, ఎమ్మెల్యే తో పాటు వెంకటేశ్వరరావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *