ఎల్బీ నగర్, మహానది న్యూస్: ఎల్బీ నగర్ లోని వన్ కన్వెన్షన్ లో ‘డాక్టర్స్ డాండియా 2025’ ఘనంగా జరిగింది. ఈ సాంస్కృతిక మహోత్సవాన్ని డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ స్థాపకురాలు డాక్టర్ కీర్తనా, భరోసా హాస్పటల్ సీఈఓ డాక్టర్ ఉదయ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి, ఎల్బీ నగర్ ఏసీపీ ఏ.కృష్ణయ్య , ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ వెంకటేశ్వరరావు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ ద్వారా తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబింపజేశారు. భాంగ్రా, ఢుంచ్ నృత్యం ద్వారా ఉత్తర భారతీయ సంస్కృతిని ఆవిష్కరించారు. ఫ్యాషన్ వాక్, లైవ్ డీజే, పాటలు, గార్బా వంటి విభిన్న అంశాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో సుమారు 1200 మంది ప్రేక్షకులు పాల్గొని సంగీతం, నృత్యం, సాంప్రదాయ ఉత్సాహంతో నిండిన సాయంత్రాన్ని ఆస్వాదించారు.

అతిథులు మాట్లాడుతూ ఈవిధమైన సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, ఆనందాన్ని పెంచుతాయి. ప్రజల విస్తృత భాగస్వామ్యం ఈ వేడుకను మరింత స్మరణీయంగా మార్చింది అన్నారు.
డాక్టర్ కీర్తనా మాట్లాడుతూ డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మహిళా సాధికారత, సేవా కార్యక్రమాలు వాటి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ మాకు ప్రేరణ అని అన్నారు.
డాక్టర్ ఉదయ్ గారు మాట్లాడుతూ ‘భరోసా హాస్పిటల్’ కేవలం వైద్యసేవల్లోనే కాకుండా సమాజానికి దగ్గరగా ఉండే కార్యక్రమాలను ప్రోత్సహించడం మా లక్ష్యం. భవిష్యత్తులో కూడా ఇలాంటి వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు.
ప్రేక్షకుల ఉత్సాహం, అతిథుల ప్రోత్సాహం, నిర్వాహకుల అంకితభావం కలసి డాక్టర్ డాండియా 2025 ను తూర్పు హైదరాబాద్‌లో ఒక స్మరణీయ సాంస్కృతిక వేడుకగా నిలిపాయి.
