పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఈనెల 29 న ప్రత్యక్ష విచారణకు విచారణకు హాజరు కావాలని పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసారు. బీఆర్ఎస్ తరుపున ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డికి నోటీసులు. బీఆర్ఎస్ పిటిషనర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులు. అక్టోబర్ 1 న మరోసారి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న పిటిషనర్ తరుపు న్యాయవాదులు.
