రంగారెడ్డి, మహానది న్యూస్: రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ గెలుపు లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు క్యామ్ మల్లేష్, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే జిల్లా ప్రజలు సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని తెలిపారు.
అనంతరం, శంషాబాద్ హుడా కాలనీలో బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన “కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్లు” పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం ఇంకా పూర్తి చేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
