బి.యన్ రెడ్డి నగర్, మహానది న్యూస్: డివిజన్లోని ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దృష్టికి బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తీసుకురావడంతో ఈ రోజు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ముంపు కాలనీలలో పర్యటించడం జరిగింది. కురిసిన భారీ వర్షాలతో వినూత్న కాలనీ, గాంధీ నగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ, స్నేహమయి నగర్ కాలనీ, పివిఆర్ కాలనీ తదితర పరిసర కాలనీలో ముంపుకు గురైన నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి సమస్యను వివరించి ముంపు సమస్య ప్రాంతాన్ని తిప్పి చూపించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అడవి ప్రాంతం నుంచి భారీ వరద రావడంతో అడ్డుగా ఉన్న కట్ట తెగి వినూత్న కాలనీకుండా వరద నీరు ప్రవేశించింది అన్నారు. తద్వారా వినూత్న నగర్ గాంధీనగర్ సౌత్ అఖిలాండేశ్వరి కాలనీ స్నేహమే నగర్ పివిఆర్ కాలనీ పద్మావతి కాలనీలు నీట మునిగేయన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం భారీ స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చెయ్యడం ద్వారా వరదను అరికట్టవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ముంపుకు గురైన కాలనీలలో పర్యటించి కాలనీ వాసులతో సమస్యను అడిగి తెలుసుకోవడం జరిగింది త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే విధంగా సంబంధించిన అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య శాశ్వత పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, జలమండలి జి.ఎం మహేందర్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ రమేష్ బాబు, డి ఈ దామోదర్ రావు, ఇరిగేషన్ డి ఈ శుక్లజ, జలమండలి డీజీఎం రాజగోపాల్, ఏ ఈ సతీష్, ఇంజనీరింగ్ ఏఈ కార్తీక్, జలమండలి మేనేజర్ భవ్య కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు, నాయకులు, తదితరులు ఉన్నారు.
