బి.ఎన్.రెడ్డి నగర్,  మహానది న్యూస్: అమెరికా డల్లాస్ లో చదువు నిమిత్తం రెండు సంవత్సరాల క్రితం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పోలే చంద్రశేఖర్ గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 04-10-2025న మాజీ మంత్రి  హరీష్ రావు, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి అక్కడి తెలుగు సంఘం (ATA) ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేస్తూ, అవసరమైన సహాయ చర్యలను చేపట్టారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేయించడంలో, మృతదేహం భారత్‌కు రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ రోజు చంద్రశేఖర్ మృతదేహం స్వదేశానికి చేరుకోగా, ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీచర్స్ కాలనీలోని వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *