ఎల్బీనగర్, మహానది న్యూస్ : అమెరికా, డల్లాస్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన పోలే చంద్రశేఖర్ ఈ నెల 3వ తేదీన గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయారు. వారి పార్థివదేహానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎల్ బి నగర్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సామ రంగారెడ్డి, స్థానిక బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డితో కలిసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ర దేశం అని చెప్పబడే అమెరికాలో ఇతర దేశాల నుండి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం కోసం వెళ్ళినవారిని అకారణంగా, అన్యాయంగా గన్ కల్చర్ తో చంపే నీచమైన సాంప్రదాయం కొనసాగుతుందని చంద్రశేఖర్ ఎమ్ డి ఎస్ కోసం అమెరికా వెళ్తే అక్కడ అకారణంగా కాల్చి చంపారు. ఇది అత్యంత బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను, ఇలాంటి సంఘటనలు అమెరికా లాంటి దేశాలలో కొనసాగకుండా ఉండాలని అన్నారు.
<span;>ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ రావు, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ మరియు తదితరులు ఉన్నారు.
