నాగోల్, మహానది న్యూస్: నాగోల్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీ (సౌత్) అభయ సీనియర్ సిటిజన్ భవనం, వెల్ఫేర్ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల సురేందర్ యాదవ్, అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, సతీష్ యాదవ్, నాయకులు, సీనియర్ సిటిజన్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

