హస్తినాపురం, మహానది న్యూస్: బి.యన్.రెడ్డి నగర్ చౌరస్తా నుండి హస్తినాపురం జెడ్పి రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరినట్లు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ తెలిపారు. శనివారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి 277 నెంబర్ బస్సును జెడ్పి రోడ్డు రూట్లో నడపాలని కోరిన వెంటనే సంబంధిత అధికారులను బస్సును నడిపే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించినందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు సుజాత నాయక్ తెలిపారు. జెడ్పి రోడ్డు నుండి బస్సు సౌకర్యం లేక అనేక కాలనీల వాసులు విద్యార్థులు ఉద్యోగులు వివిధ పనులపై వెళ్లేవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు మంత్రిని కలిసి విన్నవించినట్లు తెలిపారు.
