చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
మహానది, మన్సూరాబాద్ డివిజన్:ఈ రోజు మన్సూరాబాద్ డివిజన్ లో గల మన్సూరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయడం జరిగింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. మీ చుట్టుపక్కల బంధువులు, మిత్రులు అందరికీ ఈ కార్యక్రమం గురించి తెలియజేసి, పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, అనంతుల రాజిరెడ్డి, యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, జగదీష్ యాదవ్, రుద్ర యాదగిరి నేత, విజయ్ భాస్కర్ రెడ్డి , డాక్టర్లు, సిబ్బంది, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
