మహానది, హైదరాబాద్: బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద న‌వదీప్‌ ఫౌండేషన్‌, రెడీ టు సర్వ్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న రెడీ టు సర్వ్‌ ఫౌండేషన్‌ సభ్యులు, ఈసారి సుమారు 300 మంది పేదలకు, రోగుల బంధువులకు భోజనం అందించారు. స్వచ్ఛంద దాతల సహకారంతో జరుగుతున్న ఈ పుణ్య కార్యక్రమం ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది దాతలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా సతీష్ గౌడ్, దేవి చంద్ర రెడ్డి, అనంత రెడ్డి, పద్మావతి, ప్రకాష్ రాజు న‌వదీప్‌, ఫౌండేషన్ సభ్యులు సామర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *