చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
మహానది, బి.యన్ రెడ్డి నగర్ డివిజన్: ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల, ఎస్ కే డి నగర్ డిపిఎస్ స్కూల్, టీచర్స్ కాలనీ వినాయక మండపంలో ఏర్పాటు చేసిన పోలియో కార్యక్రమంలో బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రెండు చుక్కలు, జీవితానికి ఒక మెట్టు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని పిల్లలను పోలియో మహమ్మారి నుండి కాపాడుకోవడానికి, భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ బిడ్డలకు పోలియో చుక్కలు వేయించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మౌనిక, లేఖ శ్రీ, అక్సా పాల్, టీచర్స్ కాలనీ ఫేస్-2 అధ్యక్షులు శివ, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
