మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరాలను తెలుపుతున్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

మహానది, బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ : పార్కు స్థలమును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను వెంటనే రద్దు చేయాలని, వినియోగంలో ఉన్న పార్కును కబ్జా చేసేందుకు చూసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ముద్దుల చి రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో జిహెచ్ఎంసి బి.ఎన్.రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి కలిసి వినతి పత్రం అందజేసి వివరాలను తెలిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బి.యన్ రెడ్డి నగర్ పరిధిలోని శ్రీపురం కాలనీలో వినియోగంలో ఉన్న శ్రీ చత్రపతి శివాజీ పార్కును అక్రమంగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ లను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ గ్రామ రెవెన్యూ, బి.యన్.రెడ్డి నగర్ డివిజన్లో శ్రీపురం కాలనీ పరిధిలోని సర్వేనెంబర్ 200 లో ఈ కాలనీ ఉంది. 1967లో కాలనీ లేఅవుటు ఏర్పాటు చేసిన సందర్భంలో సుమారు 5000 గజాల స్థలాన్ని పార్కు కోసం, కమిటీ హాల్ కోసం, క్రీడా ప్రాంగణం కోసం వదిలి పెట్టడం జరిగింది. అందులో భాగంగా పార్కు స్థలములో ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వెచించి పార్కు స్థలమును అభివృద్ధి చేయడం జరిగింది. ఆ పార్కు స్థలాలను కొందరు వ్యక్తులు అక్రమంగా తప్పుడు పత్రాలు సృష్టించి వనస్థలిపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. కావున ఆయా అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలను వెంటనే రద్దుచేసి కాలనీ వాసులకు న్యాయం చేయాలని, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ పైన, తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తుల పైన చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.స్పందించిన మంత్రి త్వరలోనే సంబంధిత వ్యక్తులపై, ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ పైన పూర్తి విచారణ జరిపించి కాలనీ వాసులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రెడ్డి, పాశం విట్టల్ రెడ్డి, కల్లు విష్ణు వర్ధన్ రెడ్డి, కండె రాజేందర్, చిగురింత శ్రీధర్ రెడ్డి, జెల్ల రాములు తదితరులు ఉన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *