మహానది, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం మాచినోనిపల్లి గ్రామం టీజీఎస్‌పీడీసీఎల్‌కు చెందిన లైన్‌మెన్ తోట నాగేంద్ర రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ షిఫ్టు చేసేందుకు రైతు లైన్‌మెన్ ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు మహబూబ్‌నగర్ పరిదిలోని ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం అధికారులు లైన్‌మెన్ నాగేంద్రను పట్టుకుని అతని కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునని “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
