స్థానికులతో కలిసి చెత్త వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మహానది, మన్సూరాబాద్ డివిజన్:మన్సూరాబాద్ డివిజన్పరిధిలోని ఆటోనగర్ డంపింగ్ యార్డుకి వెళ్ళే రహదారికి ఇరువైపుల ప్రతిరోజు గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారాలు వేస్తున్నారని కాలనీ వాసులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్థానికులతో కలిసి డంపింగ్ యర్డు ప్రదేశం నందు పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇక్కడ ఇల్లులు కాలనీలు లేని కారణంగా, వాటిని విడగొట్టి పబ్బం గడుపుకునే అవకాశం లేనందున ప్రస్తుత కార్పొరేటర్ ఈ సమస్యను పట్టించుకోవట్లేదు అని అన్నారు. గతంలో సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి చొరవతో ఇక్కడ ఉదయం సాయంత్రం పూట వాకింగ్ చేయడం జరిగేదని, ప్రస్తుతం ముక్కు మూసుకొని నడిచే పరిస్థితి ఉందని సుధీర్ రెడ్డి వస్తున్నారు అని అధికారులు తూతుమంత్రంగా కొన్ని వ్యర్థాలను తీయడం జరిగింది అని అన్నారు.
అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డు ప్రక్కన హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం జరిగిందని, ప్రతిరోజూ చాలామంది వాకింగ్ చేయడం జరిగేదని, అలాగే ఇక్కడ రాత్రి పూట వ్యర్థ రసాయనాలు పోసే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలను సైతం దొంగతనం చేసి, రోడ్డు ప్రక్కన వ్యర్థ పదార్థాలు వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వెంటనే సుధీర్ రెడ్డి స్థానిక జీ హెచ్ ఎంసి అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ ఎవరూ వ్యర్థ పదార్థాలు వేయకుండా చూడాలని, ప్రతినిత్యం పరిశీలించాలని, సీసీ కెమరాలను మళ్లీ ఏర్పాటు చేసి ఇక్కడ వ్యర్ధాలు పోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, జగదీష్ యాదవ్, యాదగిరి నేత, పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *