స్థానికులతో కలిసి మాట్లాడుతున్న కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి
మహానది, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ జమ్మిగడ్డలోని 199/1, 376 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలను చూసి అధికారులు ఆశ్చర్య పోయారు. త్వరలో స్థలానికి ఫెన్సింగ్ వేస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా 199/1, 376 సర్వే నెంబర్ల లోని ప్రభుత్వ స్థలంపై హైడ్రా అధికారులు దృష్టి తీసుకెళ్తామని స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తెలిపారు .ఈ సందర్భంగా తహశీల్దార్ సుచరిత మాట్లాడుతూ స్థలాన్ని వెంటనే ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకుంటామని, ఇప్పటికే నిర్మాణం జరిగిన ఇండ్లకు నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఏసిపి సంఘటన స్థలానికి చేరుకొని అక్రమ నిర్మాణాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారులు ఇప్పటికే స్థలాన్ని స్వాధీనం చేస్తున్నారు.
