విద్యుత్ అధికారులతో కలిసి వీధి దీపాలను పరిశీలిస్తున్న కొప్పుల నర్సింహా రెడ్డి
మహానది, మన్సూరాబాద్: హయత్‌నగర్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీ ఫేస్–2 లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పాల్గొన్నారు. కాలనీలోని గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ లోడ్, లో-వోల్టేజ్ సమస్యలు, వీధి దీపాల లోపాలు వంటి అంశాలను కాలనీ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొనే విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో అధికారులు నేరుగా ప్రజల మధ్యకు రావడం ఒక మంచి ప్రయత్నం అన్నారు. డివిజన్‌లోని ప్రతి కాలనీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి, విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం అవసరం. విద్యుత్ శాఖ అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుని తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యుత్ శాఖ వారు నిర్వహించిన బస్తి బాట కార్యక్రమం వలన కాలనీల్లో సింగల్ ఫేస్,త్రీఫేస్ కరెంట్ సమస్యలను అదేవిధంగా పాత స్తంభాలు మార్చడం, కొత్త స్తంభాలు ఏర్పాటు మరయు వైర్లు ప్రమాదకరంగా ఉన్న సమస్యలు డివిజన్ ప్రజలందరూవెంటనే తెలియజేయడం వలన మరింత సమర్థవంతంగా డివిజన్ లో ఉన్న విద్యుత్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ మిరాజుద్దీన్ ఖాద్రి, లైన్మెన్ యాదయ్య, జేఎల్ఎం దినేష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు రుక్మారెడ్డి, ప్రవీణ్ గౌడ్, రవితేజ, మల్లికార్జున, మురళీధర్ రెడ్డి, సంజీవరెడ్డి, రామ్ రెడ్డి, యాదయ్య, పద్మారావు, వెంకట్ రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
