భూగర్భ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇస్తున్న కళ్లెం నవజీవన్ రెడ్డి
మహానది, హయత్ నగర్ : గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల హయత్ నగర్ డివిజన్లోని పద్మావతి కాలనీలో భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కుంగి అక్కడ ఉన్నటువంటి భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ ధ్వంసం అవడంతో పద్మావతి కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మత్తులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసులు, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీలైనంత త్వరగా భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ మరమ్మత్తుల పనులు పూర్తిచేయాలని వారు జలమండలి సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమం లో జలమండలి అధికారులు DGM రాజ్ గోపాల్, సూపెర్వైసోర్ బాలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
