మహానది, మేడ్చల్ జిల్లా : కీసర లో బొడ్రాయి పండుగ ఉన్న నేపథ్యంలో యాదాద్రి జిల్లా పగిడిపల్లి గ్రామం నుండి కీసరకు బంధువుల ఇంటికి వచ్చిన మహేష్ సాయంత్రం ఆరోగ్యం బాగాలేదు అని స్థానికంగా ఉన్న నితిన్ హాస్పటల్ కి చికిత్స కొరకు వెళ్ళిన మహేష్.డాక్టర్స్ మహేష్ కి ఇజంక్షన్స్ ఇచ్చి ట్రీట్ మెంట్ చేశారు.చికిత్స చేసిన అనంతరం మహేష్ నోటి మాటలు రాకపోవడంతో ఇక్కడి నుండి తీసుకెళ్లండి అంటూ అర్జెంట్ అంటూ హుటాహుటిన నాగారం విజయ్ హాస్పిటల్ కి తరలించారు.మార్గ మధ్యలోనే మహేష్ మృతి చెందాడు.ఇంజెక్షన్స్ ఇచ్చిన అనంతరమే మహేష్ మృతి చెందినట్టు అనుమానంతో మృతుడి బంధువులు హాస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.నితిన్ హాస్పటల్ లోని ఫర్నిచర్ ఏసీ ద్వాసం చేశారు.డాక్టర్స్ నిర్లక్ష్యంతోనే మహేష్ మృతి చెందినట్టు ఆరోపిస్తున్న మహేష్ బంధువులు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్.పోలీసులు ఎంత చెప్పిన వినని మహేష్ బంధువులు.

మృతుడి ఫైల్ ఫోటో 
