కాలనీ వాసులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

మహానది, వనస్తలిపురం: వనస్థలిపురం డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలను స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసిసోమవారం ప్రశాంత్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని స్థానిక సమస్యలపై అసోసియేషన్ పెద్దలు కాలనీ సభ్యులు కార్పొరేటర్ తో చర్చించారు. సీనియర్ సిటిజన్ భవనంఎక్కడ నిర్మించుకోవాలో మీ సమక్షంలోనే డిసైడ్ చేసుకుంటామని తెలిపారు. అదేవిధంగా మాకు ఉన్న సమస్యలు కనుక దుర్గాదేవాలయం ఎదురుగా వేస్తున్న రోడ్డు వెడల్పుగా వేయాలని కార్పొరేటర్ ని కోరారు. మా సీనియర్ సిటిజన్ భవనానికి సాంక్షన్ అయిన నిధుల కన్నా ఇంకా అధిక నిధులు కేటాయించాలని కార్పొరేటర్ ని కోరారు. ఎఫ్సీఐ కాలనీలో ఉన్న ఖాళీ స్థలంలో నుంచి భారీ వర్షాలకు పై నుండి వస్తున్న వరద నీటి కారణంగా మా కాలనీ మా కాలనీవాసులు బాగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. వెంటనే జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి తక్షణమే ఎఫ్ సి ఐ కాలనీ ఖాళీ స్థలంలో నుండి వస్తున్న వరద నీరుని కింద నుండి 10 ఫీట్ల వరకు ఎల్ టైప్ లో గోడ అమర్చాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. విష్ణు థియేటర్ వెనకాల ఉన్న పార్కు అభివృద్ధి చేయాలని చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ జిమ్, ఈవినింగ్ టైంలో సీనియర్ సిటిజన్స్, కాలనీవాసులు వాకింగ్ చేసుకోవడానికి అభివృద్ధి పరచాలని కార్పొరేటర్ ని కోరారు. అదేవిధంగా కార్పొరేటర్ పార్కుని అభివృద్ధి చేపిస్తానని కాలనీ అసోసియేషన్ కమిటీ సభ్యులకు పెద్దలకు కాలనీవాసులకు చెప్పారు. ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రభుత్వ భూమి ఎక్కడ ఖాళీగా లేనందువలన డంపింగ్ యార్డ్ రోడ్డు పైన చేస్తున్నారని చెప్పడంతో కార్పొరేటర్ స్పందిస్తూ మీకు ఒక స్థలాన్ని చూపిస్తానని అక్కడ మీరు డంపింగ్ యర్డు ఏర్పాటు చేసుకోవాలని కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీజీఎం రాజు గోపాల్, డిఈ రఫీ, వాటర్ వర్క్స్ సాయి శ్రీనివాస్, ఏఈ విగ్నేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, గోపి బాలాజీనాధ్, సెక్రటరీ కరుణాకరరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, శ్రీధర్, యుగేందరరెడ్డి, రంగయ్యచౌదరి, గోపాలరెడ్డి, బి. జే. మ్ రెడ్డి, వీరాస్వామి పాల్గొన్నారు

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *