మహానది: హయత్ నగర్ డివిజన్లోని సాయిబాబా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నేడు స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిని వారి నివాసంలో కలిసి కాలనీ సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు సాయిబాబా కాలనీలో పూర్తిస్థాయిలో సిసి రోడ్ల సదుపాయం లేకపోవడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్ కి వివరించి సిసి రోడ్ల నిర్మాణానికి వినతి పత్రం అందించడం జరిగింది. కార్పొరేటర్ స్పందించి అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా సాయిబాబా కాలనీలో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని వారు సాయిబాబా కాలనీ సంక్షేమ సంఘం సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రవి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మహేందర్, రవీందర్, శ్రీనివాస్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
