మహానది, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్‌టీసీ కాలనీ ఫేజ్-2లో కొత్త డ్రైనేజ్ లైన్, రోడ్డు పునర్నిర్మాణం కోసం ఎల్.బి.నగర్ శాసనసబ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కాలనీవాసులు గతంలో కలవడం జరిగింది. దానిలో భాగంగా సుధీర్ రెడ్డి ఈ రోజు కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సుధీర్ రెడ్డి తో మాట్లాడుతూ ఆర్.టీ.సీ.కాలనీ ఫేజ్-2 లోని ప్రధాన డ్రైనేజ్ ట్రంక్ పైప్‌లైన్ పనిచేయకపోవడం వల్ల సాయిబాబా ఆలయ వీధి డ్రైనేజ్ లైన్ ఎత్తుగా మారింది. దీని వలన ప్రతి వర్షాకాలంలో వర్షజలాలు, డ్రైనేజ్ నీరు నిలిచిపోవడం జరుగుతోందని పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి స్థానిక జీ.హెచ్.ఏం.సీ అధికారులకు సమాచారం ఇవ్వగా జీ.హెచ్.ఎం.సీ. అధికారులు పరిశీలించి, పాత డ్రైనేజ్ లైన్ సరిగా పనిచేయడం లేదని, కొత్త లైన్ వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త డ్రైనేజ్ లైన్ పనులకు రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అతి త్వరలోనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
