మహానది, బి.ఎన్.రెడ్డి నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్ 2, మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో నిర్వహించిన ‘మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్’ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలలో సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశుభ్రకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మాన్‌సూన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ డిఈ నీలిమ, మెడికల్ అండ్ హెల్త్ కాలనీ అధ్యక్షులు మూర్తి, విజయపురి కాలనీ ఫేస్ 2 అధ్యక్షులు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ చారి, పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ శర్మ, మహేందర్ రెడ్డి, విజయ్, మురళి, రాజు మరియు జిహెచ్ఎంసి అధికారులు తదితరులు ఉన్నారు.
