మహానది, హయత్ నగర్ : దేశభక్తి, విజ్ఞానం, వినమ్రతకు ప్రతీక అయిన భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డాక్టర్ కలాం కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన దూరదృష్టి కలిగిన నాయకుడు. స్వప్నాలు కనండి, వాటిని సాధించడానికి కృషి చేయండి అని ఆయన చెప్పిన మాటలు ఈరోజు కూడా ప్రతి భారత యువకుడి హృదయంలో మార్మోగుతున్నాయి. ఆయన చూపిన మార్గం మనందరికీ శాశ్వత ప్రేరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేంద్ర యాదవ్, చైతన్యపురి కార్పొరేటార్ రంగా నర్సింహా గుప్తా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
