మహానది, మన్సూరాబాద్ : ఆటోనగర్, మన్సూరాబాద్ హిందూ స్మశాన వాటికలో అసంపూర్తిగా కొనసాగిన అభివృద్ధి పనులను జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి జిహెచ్ఎంసి నిధులతో ₹50.50 లక్షల వ్యయంతో చేపట్టిన అవసరమైన అనేక సౌకర్యాలు సిద్ధం చేయబడ్డాయని నేడు ఈ పనులను స్థానిక కాలనీ వాసుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాటికాపరులు ప్రజల పై ఆర్థిక భారాన్ని తగ్గించేలా ఎక్కువలో ఎక్కువ ₹18,000–₹20,000 మాత్రమే తీసుకోవాలని కఠినంగా వారికి సూచనలు చేశారు. స్మశానంలో ఏర్పాటు చేసిన స్విచ్ బోర్డులు, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ సామగ్రి దొంగతనం అవుతున్నాయన్న విషయాన్ని గుర్తించి, దీనికి పరిష్కారంగా స్థానిక కాలనీ వాసులతో కమిటీ ఏర్పాటుచేసి పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.ఈ స్మశాన వాటిక హిందూ మతానికి చెందిన అన్ని కులాల వారు ఉపయోగించుకునేలా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిసర కాలనీల సంక్షేమ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
