సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
మహానది, కల్వకుర్తి: కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలోని కూడళ్ళలో రాత్రి పూట వీధి లైట్లు పని చేయక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సురభి వెంకటేశ్వర రావు ను సంప్రదించడంతో వెంటనే స్పందించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించారు. ఈరోజు పంచాయతీ రాజ్ ఏఈ షబ్బీర్ గ్రామంలోని శాంతి యువజన సంఘం, అయినేని దేవేందర్ రావు ఇంటిదగ్గర హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయించారు. వీధిలైట్ల ఏర్పాటుకై అడిగిన వెంటనే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిధులను మంజూరు చేయడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నంబి శంకర్, భరత్ రెడ్డి, పెద్ద నాగయ్య, దేవేందర్ రావు, రామేశ్వరావు, పోతుగంటి అశోక్, పోతరపల్లి మహేష్ తదితరులు వున్నారు.
