మహానది, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని లలితానగర్ కాలనీలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద గత 10 సంవత్సరాలుగా స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో కాలనీవాసులు రాత్రి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రమాదాలు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని కాలనీవాసులు గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి స్ట్రీట్ లైట్ విభాగ అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం అందజేశారు. అనంతరం అనేకమార్లు అధికారులతో చర్చించి, లలితానగర్ కాలనీలో స్ట్రీట్ లైట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఈరోజు సాయంత్రం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్ట్రీట్ లైట్ విభాగ సిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించి, జరగబోయే పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లలితానగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. స్ట్రీట్ లైట్ల ఏర్పాటు ద్వారా కాలనీ రాత్రి వేళల్లో సురక్షితంగా ఉండటమే కాకుండా, ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. గతంలో గడ్డిఅన్నారం మున్సిపాలిటీ చైర్మన్గా బద్దం సుభాష్ రెడ్డి కొత్త స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని కారణాల వలన అవి తొలగించబడినందున కాలనీలో మళ్లీ చీకట్లు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఇప్పుడు తిరిగి స్ట్రీట్ లైట్ సమస్యకు పరిష్కారం చూపినందుకు కాలనీవాసులు, వీధి వ్యాపారులు కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్ సిబ్బంది సైదులు, లలితానగర్ కాలనీవాసులు వేణు, బీజేపీ కార్యకర్తలు వంశీ యాదవ్, రఘునందన్ జోషి, టీంకు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.
