మహానది, కాప్రా : తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు రేగళ్ళ సతీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు ని, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోన్నారు. అనంతరం ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయలు బండారి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా కాప్రా సర్కిల్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరములుగా తన పుట్టినరోజు సందర్భంగా పరిశుద్ధ కార్మికులకు బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి వారితో కలసి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్సై సతీష్, మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి, అన్ని పార్టీ నాయకులు, అన్ని కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు , యువ సంఘాలు , నాయకులు పాల్గొని వారిని ఆశీర్వదించారు.
