మహానది, ఎల్బీనగర్ : పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుందని, ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిదని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బాధితుడు సమ్మయ్యకి1,55,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎరుకల నాంచారమ్మ బస్తి నందు నివాసం ఉండే సమ్మయ్య కడుపునొప్పికి సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వారి యొక్క ఆర్థికస్థితులు బాగలేక వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి అతని ఆపరేషన్ కు కావలసిన డబ్బుల వివరాలను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది. దానికి గాను వారికి 1,55,000(ఒక లక్ష యాబై అయిదు వేల రూపాయలు) ఎల్.ఓ.సీ.చెక్కు మంజూరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు.ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
