కొత్తపేట, మహానది: కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ బస్ స్టాప్ వద్ద జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో 21/10/2025, మంగళవారం రోజున అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి, బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ సీనియర్ లీడర్, ఠాగూర్ ఉపేందర్ సింగ్ ,చౌహన్ స్వయంగా అన్నదానం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భోజనం లేక ఆకలితో బాధే పడేవారు ఎందరో ఉన్నారు నేను, కల్లారా చాలా మంది ఆకలితో మరణించిన దృశ్యాలు చూశాను. ఇకపై జరగకూడదని పేదలకు అన్నం ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహిస్తున్నామన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం లో సుమారుగా, 500 నుంచి, 1000 మంది పైగా పాల్గొన్నారు అని అన్నారు .ఈ కార్యక్రమంలో సంగ్రం, రింకు గౌర్, నరసింహారావు, దినేష్, సూర్య,తదితరులు పాల్గొన్నారు.
