ఎల్బీనగర్, మహానది: హస్తినాపురం డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 60 లో ప్లాట్ నెంబర్ 332 పక్కన దాదాపు 700 గజాల ప్లాట్ ను కబ్జా చేస్తున్నారని సరూర్నగర్ తహసిల్దార్,ఎల్బీనగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించినట్టు శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రాథమిక పాఠశాల ఎదుట కబ్జాకు గురవుతున్న స్థలంలో టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని, దురదృష్టవశాత్తు టిఫిన్ సెంటర్ల సిలిండర్లు పేలితే పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఎలాంటి రక్షణ చర్యలు లేవని, బస్తీ దవాఖానకు వెళ్లడానికి చోటు లేకుండా చేస్తున్నారని వాటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ వినతి పత్రంలో కోరామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజు, సూరి పాల్గొన్నారు.

