మహానది, మేడ్చల్ : కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషన్ కాప్రా సర్కిల్ ఆదేశానుసారం పలు కాలనీలలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా క్లీన్ కాప్రా నినాదంతో ఇండ్ల నుండి అపార్ట్మెంట్ల నుండి వ్యాపార స్థలాలలో నిరుపయోగంగా ఉన్న వస్తువులు అనగా సోఫా సెట్లు కుర్చీలు పరుపులు ఎలక్ట్రానిక్ వస్తువులను కాప్రా హెల్త్ అండ్ శానిటేషన్ విభాగము సిబ్బంది ఏ ఎం ఓ హెచ్ డాక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించరు. కాలనీ వాసులందరు కూడా సహకరించి వారి నిరుపయోగ వస్తువులను వారి వీధిలోకి వచ్చే మున్సిపల్ సిబ్బందికి అందించవలసిందిగా ఏ ఎమ్ ఓ హెచ్ మధుసూదన్ రావు తెలియజేశారు ఈ కార్యక్రమము కాప్రా సర్కిల్ లోని అన్ని కాలనీ యందు దశలవారీగా నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ జగన్ తెలియజేశారు
