మహానది, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుంధతి విద్యాలయ పాఠశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో పాటు కీసర పోలీస్ సిబ్బంది సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కీసర ప్రధాన చౌరస్తా లో తెలంగాణ స్తూపం వద్ద స్కూల్ విద్యార్థులతో క్యాండిల్ తో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్కూల్ టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
