మహానది, ఎల్బీనగర్: ప్రజల కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు.
బుధవారం రోజు సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2000 మంది విద్యార్థులు, కాలనీ వాసులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజ, సుధీర్ సంద్ర, డాక్టర్ కవిత ముఖ్య అతిధులుగా హాజరై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం నింపారు.
అనంతరం సిపి మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు సేవలందించి అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకునేందుకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాచకొండ పోలుసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.
రాచకొండ కమిషనరేట్ లో ప్రతి ఒక్క నిమిషానికి రెండు డయాల్ 100 ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేస్తున్నామని, పోలీసులు అన్ని రకాల సేవలను ఏక కాలంలో పనిచేసి ప్రజలకు ఆరు విభాగాలుగా ఏర్పడి విజుబుల్ పోలిసింగ్ లో భాగంగా సేవలు అందిస్తు, ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పిల్లలకు దూరంగా ఉండే సీనియర్ సిటిజెన్స్ కి వారి ఇంటింటికి వెళ్లి సహాయసహకారం అందిస్తున్నామని అన్నారు.
ఆపరేషన్ స్మైలీతో ప్రజలకు దగ్గర కావడం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని, దేశంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా బాల కార్మికులను గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించామని గుర్తు చేశారు.
ప్రజల కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనన్నారు. ప్రజలకు సేవలంధించే క్రమంలో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి అందరికీ తెలిసిందేనని దేశంలో ఎన్.బి.డబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండ కమిషనరేట్ నిలిచిందని సిపి సుధీర్ బాబు గుర్తు చేశారు.
ప్రజలకు సేవలంధించే పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలి, ప్రజలకు అందించే సేవలను తెలియజేసేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలకు ఫ్రెండ్లీ పోలిసింగ్ తో పాటు చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసే వాళ్ళను శిక్షించడంలో రాచకొండ పోలీసులు ఎపుడైనా ముందుంటుందని గుర్తు చేశారు.
అనంతరం సుద్దాల అశోక్ తేజ్ మాట్లాడుతూ.. పోలీసులతో గానీ, ప్రతి ఒక్కరితో మనం కృతజ్ఞత కలిగి ఉండాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉన్నట్లు మనం కూడా ప్రెండ్లీ సిటిజెన్ లాగా ఉండాలని, దేశం కోసం, మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో దానికి కారణం పోలీసులేనని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అనంతరం కొన్ని పాటల రూపంలో ప్రజలు ఎలా ఉండాలో తెలిపారు.
సుధీర్ సంద్ర మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు విద్యార్థులు ఎంత దూరం ఉండాలో, సమాజంలో ఎలా మెదలాలో సూచించారు. పోలీసులు పడుతున్న కష్టాలని కళ్ళకి కట్టినట్లు చూపించి పోలీసుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, డ్రగ్స్, గంజాయి, ర్యాగింగ్ తదితర వాటిపట్ల అవగాహన కల్పించారు. అనంతరం సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చూసి వివరించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి పద్మజా ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ ఐపిఎస్, యాదాద్రి భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఐపిఎస్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ విమెన్ సేఫ్టీ ఉషా రాణి, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, ఎస్బి డీసీపీ జి నరసింహ రెడ్డి, డీసీపీ ఎస్ఓటి రమణ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ -1 శ్రీనివాస్, డీసీపీ ట్రాఫిక్ -2 శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్, అడిషనల్ డీసీపీలు, ఏసిపిలు తదితరులు పాల్గొన్నారు.
