♦నాగోల్ లో పేదలు, వృద్ధులకు అన్నదానం చేసిన బాచిరెడ్డి
నాగోల్, మహానది న్యూస్, నవంబర్ 01:
రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకేటి శ్రీహరి పుట్టినరోజు వేడుకలు నాగోల్లోని వాత్సల్య ఫౌండేషన్లో ఘనంగా జరిగాయి. సంఘ సేవకులు నంగి బాచిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి శ్రీహరి జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక సేవకు ప్రతీకగా ఈ వేడుకలను వాత్సల్య ఫౌండేషన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నంగి బాచిరెడ్డి కేక్ కట్ చేసి, పేదలకు, వృద్ధులకు అన్నదానం చేసి, మంత్రిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా నంగి బాచిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల పురోగతిలో మంత్రి వాకేటి శ్రీహరి చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తారని, అలాంటి నాయకుడికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.మంత్రి శ్రీహరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు నంగి బాచిరెడ్డి పేర్కొన్నారు.

