మహానది , హైదరాబాద్ :
కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం అని ప్రతీతి అని, కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం హిందూ ధర్మం,ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ గోపా ఆధ్వర్యంలో 44వ వనభోజనాలు నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్కులో నిర్వహించిన సభలో అన్నారు. వన భోజనాలు ఐక్యత, స్నేహభావాలు పంచుతాయని, వివిధ సంఘాలు,కుటుంబాలు, స్నేహితులు కలిసి ఈ భోజనాలలో పాలుపంచుకుంటారని, సాంప్రదాయకంగా వనభోజనాలు ఉసిరి చెట్ల కింద నిర్వహిస్తారని అన్నారు. గోపా రాష్ట్ర కార్యదర్శి జి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, అరటి ఆకుల్లో సమిష్టిగా భోజనం చేయడం, విశిష్టతలు కలిగిన ఈ మాసం హిందువులకు ప్రీతిపాత్రమైనదని అన్నారు. ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ చెక్కిళ్ల మాట్లాడుతూ ఈ మాసం ఆధ్యాత్మికత,అనుబంధాల కలయిక అని,గౌడ కులస్తులందరూ తమ పేరు చివర గౌడ్ అనే పదాన్ని చేర్చుకొని, ఉన్నత విద్యను అభ్యసించి, కులస్తులకు సహాయమందించాలని సూచించారు. విద్య, ఉద్యోగాలలో మన కుల ప్రతినిధిత్వం తప్పనిసరిగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ కులానికి చెందిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, వివిధ రంగాల్లోని వృత్తి నిపుణులు (ప్రొఫెషనల్స్) పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ జిల్లా శాఖల గోపా జీవిత సభ్యులు వారి కుటుంబాలతో హాజరై ఆట పాటలతో ఆనందో త్సాహలతో ప్రకృతిఒడి లో సేద తీరారు. తాము నివసించే కాలనీలలో సమావేశాలు నిర్వహించి గోపా సభ్యత్వాలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పలు జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు హాజరై వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.మన ఐక్యతే మన బలం అనే నినాదం తో ముందుకు సాగాలని కోరారు. వివిధ జిల్లాల గోపా అధ్యక్షులు వారి కార్యవర్గాన్నిపరిచయం చేశారు. ఈ సందర్బంగా అందరూ ఐక్యత, సంబంధాల ఆవశ్యకతకు ప్రాధాన్యమివ్వాలని తీర్మానించారు. అనంతరం డిసెంబర్ 28న జరగనున్న గోపా 50 సంవత్సరాల పండుగ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ స్వర్ణ ఉత్సవాలను చేయాలని కోరారు.

