మహానది, ఎల్బీనగర్:
హస్తినాపురం డివిజన్ పరిధిలోని గోల్డెన్ హోమ్స్ సత్యదేవకి రెసిడెన్సీలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్య నారాయణ వ్రతం,రుద్రాభిషేకం, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెసిడెన్సి భక్తులందరూ ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజలు నిర్వహించారు.అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణా రాజు, ప్రధాన కార్యదర్శి నగేష్, ఇతర అసోసియేషన్ సభ్యులందరూ కలిసి భోజనం ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.
