నాలుగు కార్మిక కోడ్‌లకు వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలో మహా ధర్నా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్‌లు కార్మిక హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు మణుగూరులో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బుధవారం సాయంత్రం ప్రాంత సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు శాశ్వత, కాంట్రాక్ట్ కార్మికులు భారీ సంఖ్యలో చేరి ధర్నా నిర్వహించారు.
భారత జాతీయ కార్మిక సంఘం నాయకత్వంలో జరిగిన సమావేశంలో అఖిలపక్ష సంఘాలకు చెందిన వత్సవాయి కృష్ణంరాజు, రామ్ నరసయ్య, వి. వెంకటరత్నం, నాగేల్లి వెంకట్, ఏనుగు చంద్రారెడ్డి, ఆర్. మధుసూదన్ రెడ్డి, వెలగపల్లి జాన్ తదితరులు పాల్గొని కోడ్‌లపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమరుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన కార్మిక హక్కులు నాలుగు కార్మిక కోడ్‌లతో బలహీనమవుతున్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు అనివార్యమవుతాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలు ఐక్యంగా కదిలి పోరాటాన్ని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. తరువాత కార్మికుల సమస్యలను వివరించిన వినతిపత్రాన్ని ఏరియా ప్రధాన అధికారికి నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిల్వేరు గట్టయ్య, ఎస్. కుమారస్వామి, వై.డి. నాసర్ పాషా, పుల్లారావు, నాయుడు, లక్ష్మణరావు, జీవరత్నం, గంగాధర్, ఎం. శ్రీనివాస్, బుర్ర వెంకటేశ్వర్లు, నాగయ్య, ఇమాముద్దీన్, ఇంతియాజ్ పాషా, రాజశేఖర్, వీసం శ్రీనివాస్, సందీప్, సాయి నాదాచారి, మస్తాన్, నరసయ్య, నాగేశ్వరరావు, భూక్యా రమేష్, ఆర్. ప్రసాద్, ఇమ్రాన్, మురళి, పద్దం శ్రీనివాస్, బంగారి పవన్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులు నాగరాజు, రావులపల్లి ముత్తమ్మ, సీత, రేణుక తదితరులు కూడా భారీ సంఖ్యలో హాజరై ఆందోళనకు మద్దతు తెలిపారు.

