మహానది, రంగారెడ్డి :
పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను బలోపేతం చేయడం, భవిష్యత్ తరాలకు పచ్చగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని అందించడం లక్ష్యంగా ECG ఫౌండేషన్ — సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోనే అభూతపూర్వమైన చారిత్రాత్మక విద్యార్థి గ్రీన్ అవేర్‌నెస్ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ మహోత్సవంలో భాగంగా 10,000 మొక్కలు నాటగా, 2,000 మంది విద్యార్థులు, 200 మంది అధ్యాపకులు, ఈసీజీ సంస్థ వాలంటీర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ భాద్యతను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా గారెత్ విన్స్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమీషనర్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్, గౌరవ అతిధులుగా అజయ్ మిశ్రా నేషనల్ చైర్మన్, UNACCC & మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎనర్జీ శాఖ – తెలంగాణ, డాక్టర్ బి. ప్రభాకర్, IFS — చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, తెలంగాణ, డాక్టర్ జి. వి. ప్రకాష్ — సర్జికల్ గ్యాస్ట్రో స్పెషలిస్ట్, డాక్టర్ జె. రామస్వామి — ప్రసిద్ధ విద్యావేత్త & మాజీ ప్రిన్సిపల్ పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షుడుగా డాక్టర్ లక్ష్మికాంతం IAS రిటైర్డ్, మాజీ JEO – టీటీడీ వ్యవహారించారు.
ఈ సందర్బంగా ఈసీజీ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ వి. మార్కండేయులు మాట్లాడుతూ పచ్చదనం యొక్క విలువను ప్రత్యేకంగా వివరించారు. “చెట్టు నాటటం కేవలం కార్యక్రమం కాదు, అది రాబోయే తరాలకు ఇచ్చే జీవ ఉపహారం. మొక్క నాటే చిన్న చర్యే భవిష్యత్తుకు అత్యంత పెద్ద రక్షణ. విద్యార్థులు నేలని తాకినపుడు, పర్యావరణంతో ఉన్న అనుబంధం పెరుగుతుంది. వారి మనసుల్లో సానుభూతి, ప్రేమ, బాధ్యత, జీవంపై గౌరవం పెరుగుతుంది. చెట్లే ఆక్సిజన్, వర్షాలు, నేల, వాతావరణం — అంటే జీవం. ప్రతి విద్యార్థి జీవితంలో 100 చెట్లు నాటితే భారత భవిష్యత్తులో వాతావరణ సంక్షోభమే ఉండదు.” అని పేర్కొన్నారు.
ఈసీజీ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ రంగంలో భారత స్థానం, చెట్ల వైద్య ప్రాధాన్యత మరియు మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని వివరిస్తూ..“చెట్ల పెరుగుదలలో భారత్ ప్రపంచంలో ప్రముఖంగా ఉన్నా, జనాభా–అటవీ నిష్పత్తి పరంగా ఇంకా దూరం ప్రయాణించాలి. పచ్చదనం జీవన శైలిగా మారితే — భారతదేశం ప్రపంచంలో పర్యావరణ సంతులనం కలిగిన దేశంగా నిలుస్తుందన్నారు. ప్రతి విద్యాసంస్థ ఏడాదిలో కనీసం ఒక ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈసీజీ ఫౌండేషన్ కోర్ టీమ్ సభ్యులు కుర్మారావు సత్తారు, డాక్టర్ కొట్ల సుధీర్, ప్రొఫెసర్ జె. రామస్వామి, సుధర్షన్, అల్లం నాగేశ్వరరావు, డాక్టర్ ఆదిత్య, బుర్ర శ్రీనివాస్, సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ & ఇండస్ వ్యాలీ స్కూల్ మేనేజ్‌మెంట్ సభ్యులు రాఘవ రెడ్డి, కొట్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
