మహానది, హయత్ నగర్:
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని దసరా గుడి ప్రాంగణంలో జరుగుతున్న బొడ్రాయి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరిగిన విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎల్.బి.నగర్ శాసనసబ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బొడ్రాయి కార్యక్రమం విజయవంతం చేసినందుకు శుభాశీస్సులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సాగర్ రెడ్డి సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, స్కైలాబ్, పారంద రమేష్, సాయిచంటి, బొడ్రాయి ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
