మహానది, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు డీసీసీ అధ్యక్షుల ఎంపిక అభిప్రాయా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుదుచ్చెరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని, నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు.కా ర్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ మీర్ అలీఖాన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సురభి వెంకటేశ్వర రావు, రాష్ట్ర సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

