మహానది, హైదరాబాద్ : సమాచార హక్కు (RTI) చట్టంపై అవగాహన పెంపు దిశగా పనిచేస్తున్న ప్రముఖ సామాజిక సంస్థ ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాపోలు లింగస్వామి నియమితులయ్యారు. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ప్రకటనలో లింగస్వామి సమాచార హక్కు చట్టంపై లోతైన అవగాహన కలిగిన నాయకుడు,రాష్ట్రవ్యాప్తంగా కమిటీల ఏర్పాటు, సభ్యుల సమన్వయం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని విశ్వాసం ఉంది అని తెలిపారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాపోలు లింగస్వామి మాట్లాడుతూ 2005లో అమలులోకి వచ్చిన ఆర్టీఐ చట్టం పారదర్శక పాలనకు పునాది. కానీ అనేక చోట్ల అధికారులు చట్టాన్ని పూర్తిగా అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. సమాచారాన్ని ఇవ్వడంలో ఆలస్యం, తప్పుడు కారణాలతో తిరస్కరణలు రావడం ప్రజల్లో నిస్పృహ కలిగిస్తోంది అని అన్నారు.ప్రజలందరికీ RTI చట్టంపై సరైన అవగాహన కలిగించేందుకు, సంస్థ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపడతాం. ప్రజలు తమ హక్కులపై ప్రశ్నించాలి, అధికారులపై భయపడకుండా సమాచారం అడగగల స్థితికి రావాలి అని పిలుపునిచ్చారు.అంతేకాకుండా తన నియామకానికి సహకరించిన ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్, సంస్థ సభ్యులందరికీ లింగస్వామి ధన్యవాదాలు తెలిపారు.
