మహానది ప్రతినిది. (మణుగూరు ) భూలోకం నుంచి “స్వర్గ”లోకంలో ఉన్న తన”తాతగారి” వద్దకు వెళ్లిపోయారు మన”తారకరత్న”
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పినపాక నియోజకవర్గం మణుగూరు మండల కేంద్రంలో పత్రికా ప్రకటనలో భాగంగా నందమూరి వారసులు,ప్రముఖ సినీ నటులు నందమూరి తారక రత్న మృతి పట్ల నందమూరి సేవా సమితి సభ్యలు తెలుగుదేశం పార్టీ అభిమానులు వాసిరెడ్డి చలపతిరావు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడుతూ…తారకరత్న మరణ వార్త నన్ను చాలా కలచివేసిందని అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సినీ నటుడు నందమూరి తారకరత్న ఇక లేరు.దాదాపు 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న..తెల్లవారుజామున కన్నుమూశారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మొదలుపెట్టిన ‘యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న..తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.హుటాహుటిన కుప్పం ఆస్పత్రికి తరలించిన తెలుగుదశం నేతలు..అక్కడ చికిత్స అందించారు.ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.అప్పటి నుంచి అక్కడే చికిత్స అందించారు.తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని..నారాయణ హృదయాలయ వైద్యులు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు.ఐనప్పటికీ..అందుబాటులో ఉన్న అధునాతన వైద్యం అందిస్తూ,ఆయన్ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు,కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.దాదాపు 23రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న.. తెల్లవారుజామున కన్నుమూశారని తీవ్ర దిగ్భ్రాంతికి గురై ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కొనియాడారు ఈ కార్యక్రమంలో చెన్నకేశవులు, నామ వెంకటేశ్వరరావు, మల్లేడి లోకేష్, దొడ్డపెనేని రాంగోపాల్, పాలవాయి సుధాకర్,వేముల లక్ష్మయ్య, ఎలమాటి పూర్ణచంద్రరావు, ముసునూరి చందర్రావు ,దొడ్డ తిరుపతి . నల్లడి పవన్,కందిమల్ల సాయి, త్రిమూర్తులు, దుర్గాప్రసాద్, ఎం శ్రీనివాస్, పోడెం. రమణయ్య,యార్లగడ్డ.రాజయ్య వల్లభనేని రమణ గడ్డంమల్లి,ముత్యాల రావుతదితరులు పాల్గొన్నారు.
- మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో నందమూరి సేవ సమితి – కమ్మ మహాజన సేవ సంఘం ఆధ్వర్యంలో నటుడు నందమూరి తారకరత్న కు నివాళులర్పించారు…..