- వర్కింగ్ జర్నలిస్టులందరికీ జిల్లా కేంద్రంలోనే ఇండ్ల స్థలాలు
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భరోసా
మహానది ప్రతి నిధి(పినపాక నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరకగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను ఆయన నివాసంలో భద్రాచలం జర్నలిస్ట్ జేఏసి సభ్యులు శనివారం కలిశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని జేఏసి సభ్యులు విప్ రేగా కాంతారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. దానిలో భాగంగానే ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం కలెక్టర్కు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ జీవో ప్రకారమే జిల్లాలో పనిచేసే జర్నలిస్టులందరికీ కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని భరోసానిచ్చారు. ప్రబుత్వ విప్ రేగకాంతారావు కలిసిన జేఏసీ బృందంలో TWJF జాతీయ కౌన్సిల్ మెంబర్ చిర్రా శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి , రాష్ట్ర కమిటీ సభ్యులు డి. రవికుమార్ , ప్రధాన కార్యదర్శి గండెబోయిన వెంకటేశ్వర్లు , సహయ కార్యదర్శి సాయి సంపత్ రెడ్డి, టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి మొబాగాపు ఆనంద్ కుమార్, , టిజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. బాలయోగి సభ్యులు కాటా సత్యం, పూనెం ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.