ఆర్టీసీ అధికారులపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే  పాయం 

చిత్తశుద్ధి ఉంటే ఖమ్మం సభకు బస్సులను పంపండి

మహానది న్యూస్  | జూన్ 30 2023| భద్రాద్రి కొత్తగూడెం జిల్ల |బీఆర్ఎస్ ప్రభుత్వం పొంగులేటి శ్రీనన్న అనుచరులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు , మండిపడ్డారు. జూన్ 2న ఖమ్మం నగరంలో రాహుల్ గాంధీ  పర్యటన నేపథ్యంలో పొంగులేటి శ్రీనన్న ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు జనాలను తరలించేందుకు ముందస్తుగానే ఆర్టీసీ అధికారులతో సంప్రదించి, ఖమ్మం జనగర్జన సభకు బస్సులకు డీడీలు చలానాలు కట్టి పరిమిషన్లు ఇవ్వమంటే ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి బస్సులు పెట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీ నష్టాలు పూరించేందుకు ప్రైవేట్ కార్యక్రమాలకు వివాహాలకు బస్సులు అద్దెకిచ్చే ఆర్టీసీ సంస్థ, బహిరంగ సభకు బస్సులను ఇవ్వకపోగా అనేక సాకులు చెబుతున్నారని, ఆర్టీసీ అధికారులకు సంస్థ యొక్క నష్టం నివారణ చర్యలు చేపట్టడంలో చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టిఆర్ఎస్ సభలు నిర్వహించి ఉంటే వారి ఇష్టానుసారంగా బస్సులను పంపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ దిగజారుడు నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట అన్నారు ఈరోజు ఉదయం తమ కార్యకర్తలతో కాంగ్రెస్ నాయకులతో ఆర్టీసీ డిపో ముందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. పోలీసు అధికారులు బిఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం బహిరంగ సభను పినపాక నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలతో పాల్గొని సభను విజయవంతం చేస్తామని అదేవిధంగా శ్రీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *