- మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో అంతర్జాతీయ అదివాసీ దినోత్సవం సందర్బంగా ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు.
- ఆదివాసీలు వారి ప్రత్యేక చట్టాలు, పభుత్వ పథకాలు, విద్యావంతులైన యువతకు ఉపాధి, ప్రత్యేక విద్యాలయాలు, గిరిజన యూనివర్సిటిలపై అవగాహన కలిగి ఉండాలి. – మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు
మహానది న్యూస్,మణుగూరు,ఆగష్టు 9 ,వెబ్ మీడియా : అంతర్జాతీయ అదివాసీ దినోత్సవం సందర్బంగా మణుగూరు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో బుదవారం నాడు ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సును సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. ఆదివాసీలు వారి కొరకు ఏర్పరచిన ప్రత్యేక చట్టాలు, పభుత్వ పథకాలు, విద్యావంతులైన యువతకు ఉపాధి, ప్రత్యేక విద్యాలయాలు, గిరిజన యూనివర్సిటిలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రపంచ ఆదివాసీ జనాభా హక్కుల పరిరక్షణ, పురోగతి కోసం ప్రతి ఏడాది ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ అంశాల మెరుగుదల కోసం ఆదివాసీలు చేస్తున్న సేవలు, చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఆదివాసుల సంరక్షణ, అభివృద్ది కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 16 (4), 46, 275, 330, 332, 243డి, 5,6 షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతంలో ఉండే గవర్నలకు విచక్షణ అధికారాలు ఉన్నాయని అన్నారు. ఆదివాసి తెగలకు భూములపై హక్కులను కల్పిస్తూ 2006 కొత్త చట్టం వచ్చిందని, మన రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉందని అన్నారు. ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భూమి లేని కుటుంబాలకు భూమిని అందజేస్తోందని, విద్యావంతులైన యువతకు ఉపాధి, బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అందరికీ విద్య, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటుందని అన్నారు. చట్టాలు వాటి విలువ, వీటి ద్వారా జరిగే ఉపయోగాల గురించి వివరించారు. ఆదివాసీల సంస్కృతి, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, విద్య, పర్యావరణం, ఆరోగ్యం, మానవ హక్కులకు సంబంధించిన ఆదివాసీల సమస్యలపై విస్తృతమైన అధ్యయనం జరగాల్సి ఉందని అన్నారు. చట్టాలపై అవగాహన లేని అమాయకులైన ఆదివాసీలను, కొందరు స్వప్రయోజనాల కోసం మత్తు పదార్దాలను బానిసలనుగా చేసి, గంజాయి రవాణాకు చేయించడంతో, వారిపై కేసులు నమోదై కుటుంబాలను దూరమై జైల్లలో మగ్గుతున్నారని అన్నారు. కేసులు నమోదైన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వార ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి వచ్చిందనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. న్యాయ విజ్ఞాన రాష్ట్ర న్యాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతీ పేదవాడికి న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద వారికి ఉచితంగా న్యాయవాదిని వినియోగించుకునేలా ప్రత్యేక న్యాయవాదిని సైతం నియమించామని తెలిపారు. ధరఖాస్తు చేసుకున్నావారికి ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని, చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నామని పేర్కొన్నారు. కోర్టు కేసుల పెండింగ్ సమస్యకు లోక్ అదాలత్ పరిష్కారమని, కోర్టు వాయిదాలతో సమయం, డబ్బు వృధా అవుతుందనీ, రాజీ పడదగిన కేసులన్నిటిని లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిపి దుర్గాభాయ్, బార్ ప్రెసిడెంట్ యం. శ్రీనివాసరావు, న్యాయవాదులు కందిమళ్ల నరసింహారావు, ఏ. రామ్మోహన్ రావు, దాసరి కవిత, కె. నగేష్ కుమార్, చిర్రా సరస్వతి, వి. శైలజ, యన్. సావిత్రి, బిక్కసాని శ్రీనివాస్, సర్వేశ్వరరావు, ఈర్ల రాము, వాసవి, లావణ్య, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.