• రెండో విడత అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ను కలిసిన TWJF యూనియన్ సభ్యులు
  • భద్రాద్రి జిల్లా అక్రిడిటేషన్ కమిటి  మెంబర్ కర్ర అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
  •  రెండు వారాలోపు మీటింగ్ ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓ కు సూచించిన కలెక్టర్ ప్రియాంక ఆల

మహానది న్యూస్,భద్రాచలం ఆగష్టు 11 ,వెబ్ మీడియా : భద్రాద్రి జిల్లాలో రెండవ విడత అక్రిడేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరు చేయాలని, భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాద్రి జిల్లా అక్రిడిటేషన్ కౌన్సిల్ సభ్యులు కర్ర అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో TWJF సభ్యులు శుక్రవారం కొత్తగూడెం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రియాంక ఆల ను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ప్రియాంక అల సానుకూలంగా స్పందించి, కొద్ది రోజుల్లోనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని, రెండు వారాల్లోపు అక్రిడిటేషన్లు జారీ ప్రక్రియను పూర్తి చేయాలని డిపిఆర్ఓ శ్రీనివాసరావుకు జిల్లా కలెక్టర్ సూచించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పూదోట సూరిబాబు, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన వెంకటేశ్వర్లు,సహాయ కార్యదర్శి సాయి సంపత్ రెడ్డి, కోశాధికారి హరి నాగవర్మ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కటారి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బోడ లక్ష్మణ్ రావ్,పుష్ప గిరి, గోపినాథ్ లు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *