వితంతులకు వితరణ చేసిన జెకెసిటీ

మహానది న్యూస్ ,భద్రాచలం అక్టోబర్ 2 : జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ( జెకెసిటీ ) ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం వితంతు ఆరు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున వితరణ అందజేశారు. జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ రెండవ సమావేశం ఒడిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా మోటు తాలూకా ఇస్మాయిల్ నగర్లో జరిగింది. సమావేశంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ మాట్లాడుతూ భర్తలను కోల్పోయి కడు బీద పరిస్థితిలో బతుకుతున్న పేద వితంతు కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునే అవకాశం అల్లా కల్పించాడని ఇంకా మరెందరో చీకటి కుటుంబాలకు వెలుగులు నింపే మహత్తర కార్యక్రమానికి అల్లా తనకు సహాయ సహకారాలు అందిస్తాడని తెలిపారు. అల్లా తనకు ఇచ్చిన సంపదలో పేదలకు హక్కు ఉందని దానిని పొందే పేదలు వారి దువాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో నుంచి ఎంతో కొంత సాటి మనుషులకు సహాయం చేయాలని అప్పుడే మనిషిలో ప్రేమ ఆత్మీయత గుణాలు అలవాడతాయన్నారు. కష్టకాలంలో మనిషికి మనిషి సహాయం చేయడం దేవుని సన్నిధిలో ప్రేమను పొందటానికి ఒక మార్గం అన్నారు. ఉన్న కాలంలో మరింత సేవా కార్యక్రమాలు చేసేందుకు తన శాయశక్తుల శ్రమిస్తానని స్థానిక నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు తమ ట్రస్టు ద్వారా చేపట్టే చిన్నపాటి కుటీర పరిశ్రమల్లో ఉపాధి పనులు కల్పించడం జరుగుతుందన్నారు. నేడు సమాజంలో ఆడపిల్లకు వివాహం చేయాలంటే మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకు గురై కుటుంబాలు చిన్నబిన్నం అవుతున్నాయని అటువంటి వారి కోసం తన వంతు సాయంగా ఆడపిల్ల వివాహాలకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కుంట గ్రామానికి చెందిన వితంతు బషీర్ సతీమణికి పదివేల రూపాయలు. అదేవిధంగా ఆవిదున్నేసా రెహమాన్ ఖాన్ సతీమణి. నౌషాద్బి. మరో వితంతు కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం 60 వేల రూపాయలను వితరణగా ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్, సెక్రటరీ ఇమ్రాన్ ఖాన్. సుభాని, మోటు గ్రామ పెద్దలు మాసుం ఖాన్ చేతుల మీదుగా నగదును వితంతు కుటుంబాలకు అందజేశారు. అనంతరం ట్రస్టులో పని చేస్తూ విశిష్ట సేవలను అందిస్తున్న సభ్యులకు శాలువాలతో సన్మానించారు. గిరిజన యువతి యువకులకు కండువాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీలేరు ప్రభుత్వ పిహెచ్సి వైద్యులు అబ్దుల్ రెహమాన్, అక్బర్, నూర్ చాచా తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *